బిగ్ బాస్ 4 ఫైనల్ రేటింగ్ ఎంతంటే..?

  • December 31, 2020 / 06:16 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కోసం మొదట హోస్ట్ విషయంలో కాస్త సస్పెన్స్ ను క్రియేట్ చేసినప్పటికీ ఫైనల్ గా నాగార్జుననే మళ్ళీ వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ గా తన టాలెంట్ ఏమిటో సీజన్ 3 ద్వారానే నిరూపించుకున్న నాగ్ ఈ సారి ఆ డోస్ ను మరింత పెంచేశాడు. తన మాటలతో పంచ్ లతో నెవర్ బిఫోర్ అనేలా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు.

ప్రతి ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులు అయితే బాగానే క్లిక్కయ్యాయి. కంటెస్టెంట్స్ చాలా వరకు వారి కసితో పాటు ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం షో రేటింగ్ పెరగడానికి యూజ్ అయ్యింది. ఇక ఈ సారి ఫైనల్ కు గతంలో ఎప్పుడు లేనంత హైయ్యెస్ట్ రేటింగ్స్ అయితే వచ్చాయి. ఏకంగా 19.51రేటింగ్ తో బిగ్ బాస్ సీజన్ 4 భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఈ సీజన్ షో మొదలైన రోజు కూడా 18పైగా రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 1కు ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండగా ఫైనల్ డే రోజు 14.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇక ఆ తరువాత సీజన్ కు నాని హోస్ట్ గా ఉండగా 15.05 రేటింగ్ దక్కింది. ఇక సీజన్ 3కోసం సరికొత్త ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి రోజు నుంచి మంచి హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. సీజన్ 3 ఫైనల్స్ కు 18.29 రేటింగ్ అందుకున్నట్లు సమాచారం.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus