బిగ్ బాస్ 4: ఏంది పంచాయితీ ? కథ ఎట్లుంది..?

  • November 14, 2020 / 12:41 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ తగ్గిందంటూ బిగ్ బాస్ ఎవర్నీ నవ్వద్దు అన్నాడు. హౌస్ లో నవ్వు నిషేధం అని, ఎవరు ఎంత ఎంటర్ టైన్ చేసినా నవ్వకుండా ఉంటేనే, మీకు ఇంటినుంచి వచ్చిన బహుమతి లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ నవ్వకుండా ఉండటానికి శతవిధాలుగా ప్రయత్నించారు. ఇక్కడే బిగ్ బాస్ సోహైల్ లాగా మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.

సోహైల్ ఏంది పంచాయితీ అని అడిగాడు. తర్వాత కథ ఎట్లుంది ? అంటూ సోహైల్ యాసలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. దీంతో సోహైల్ ఈ టాస్క్ ఓడిపోయినా పర్లేదు బిగ్ బాస్ మీరు నాకోసం మాట్లాడారు.. నన్ను ఏంది పంచాయిత్ అని అడిగారు అది చాలు నాకు అంటూ సంతోషపడ్డాడు.

ఇక ఈ టాస్క్ లో అరియానా, మోనాల్, లాస్య, హారిక అందరూ కూడా నవ్వేశారు. అభిజిత్, అవినాష్, మోహబూబ్ ,సోహైల్ కూడా నవ్వుతూనే ఉన్నారు. ఈటాస్క్ లో ఫెయిల్ అయినా కూడా ఎంటర్ టైన్ బాగా చేశారు కాబట్టి మీకు బహుమతులు ఇస్తాను అని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ ఆనందంతో చిందులేశారు. అదీ మేటర్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus