బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కి ఒక పరీక్షపెట్టాడు బిగ్ బాస్. ఇంతవరకూ ఎవరికీ చెప్పని సీక్రెట్ ని గనక చెపితే ఇంటినుంచి లేదా మీ ఆప్తుల దగ్గరనుంచి వచ్చిన సందేశాన్ని పంపిస్తానని చెప్పాడు. దీంతో కన్ఫెషన్ రూమ్ కి ఒక్కొక్కరిగా వచ్చి సీక్రెట్స్ ని షేర్ చేస్కున్నారు. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అఖిల్ చేతిలో సందేశం పంపాలా వద్దా అనే పవర్ ని ఉంచాడు బిగ్ బాస్. ఎవరికీ చెప్పని సీక్రెట్ అని తెలిస్తేనే సందేశం పంపేలా లేదంటే వచ్చిన కవర్ ని చింపేశేలా ఈ టాస్క్ ని డిజైన్ చేశాడు.
రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూస్తే అఖిల్ రెండు కవర్లని చింపేశాడు. ఇందులో ఎల్లో కలర్ కవర్, ఇంకా పింక్ కలర్ కవర్స్ ఉన్నాయి. వాటిని డైనింగ్ టేబుల్ పైన అతికించుకుంటూ అబిజిత్ ఇంకా లాస్యలు కనిపిస్తున్నారు. అంటే, ఎవరో ఇద్దరికి వచ్చిన సందేశాలని అఖిల్ ఇవ్వలేదని అర్ధమవుతోంది. అంతేకాదు, ప్రోమోలో హారిక రిలేషన్ షిప్ గురించి వాళ్ల అమ్మకి చెప్తోంది. రెండు సంవత్సరాల క్రితం హారికకి ఒక అబ్బాయితో రిలేషన్ షిప్ ఉండేదని చెప్తూ ఏడ్చేసింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.
మరి అఖిల్ ఎవరిద్దరి లెటర్స్ ఇవ్వలేదు…? ఎవరు వాటిని చదవలేదు అనేది ఆసక్తికరం. అంతేకాదు, లెటర్స్ వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే అక్కడ అరియానా, అభిజిత్, అవినాష్ ముగ్గురు లెటర్స్ చదువుతున్నట్లుగా మాత్రం కనిపించడం లేదు. మిగతా వాళ్లకి లెటర్స్ వచ్చాయి. ముందుగా మోనాల్, సోహైల్, మెహబూబ్, లాస్య, హారికలు లెటర్స్ చదువుతూ కనిపించారు. కానీ అరియానా ఇంకా అభిజిత్ అవినాష్ లు మాత్రం లెటర్స్ తీస్కున్నట్లుగా కనిపించడం లేదు.
మరి అఖిల్ ఎందుకు ఇద్దరి లెటర్స్ ఇవ్వలేదు అనేది ఎపిసోడ్ లో చూస్తేనే కానీ తెలిసే అవకాశం లేదు. అదీ మేటర్. మరిన్ని ఇంట్రస్టింగ్ బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీఫోకస్ కి లాగిన్ అవ్వండి.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!