ఈ శుక్రవారం విడుదలవుతున్న ఆరు చిత్రాల్లో ప్రేక్షకుల అంచనాలను పెంచిన చిత్రం “బ్లఫ్ మాస్టర్”. తమిళ సూపర్ హిట్ చిత్రం “శతురంగవేట్టై”కు రీమేక్ గా గోపీగణేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ పాత్ర పోషించగా.. నందిత శ్వేత కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 28న విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్, ప్రోమోస్ కంటే ముఖ్యంగా డైలాగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సంక్రాంతికి భారీ చిత్రాలన్నీ క్యూకట్టినా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు బడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ముందుకు రావడానికి కారణం సినిమా కంటెంట్ మరియు సత్యదేవ్ పెర్ఫార్మెన్స్.
ఈ రెండు విషయాలు కాకుండా మరో ముఖ్యమైన విషయం కూడా డిస్ట్రిబ్యూటర్స్ ను గట్టిగా ఆకట్టుకొంది. అదే 30 ఇయర్స్ పృధ్వీ కామెడీ. ఒక ఏడాది క్రితం వరకూ కేవలం పృధ్వీ కామెడీ వల్లనే సినిమాలు నడిచిన సందర్భాలున్నాయి. అనంతరం కామెడీ సినిమాల జోరు తగ్గడంతోపాటు కొత్త కామెడియన్లు వెల్లువ పెరగడంతో పృధ్వీకి ఈమధ్యకాలంలో సరైన రోల్ దొరకలేదు. కానీ.. బ్లఫ్ మాస్టర్ లో పృధ్వీని మళ్ళీ పూర్తిస్థాయిలో వినియోగించుకొన్నారట. సో, బ్లఫ్ మాస్టర్ సినిమాలో సత్యదేవ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తోపాటు పృధ్వీ కామెడీ కూడా మనల్ని భీభత్సంగా ఎంటర్ టైన్ చేయనుందన్నమాట.