Bobby Deol: బాలయ్య సినిమాకు బాబీ డియోల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • February 1, 2024 / 07:34 PM IST

బాలయ్య బాబీ కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ రోల్ కోసం బాబీ డియోల్ తీసుకుంటున్న పారితోషికం సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

ఈ సినిమా కోసం బాబీ డియోల్ రికార్డ్ స్థాయిలో ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. బాబీ డియోల్ రెమ్యునరేషన్ గురించి తెలిసి సౌత్ ఇండస్ట్రీ సైతం షాకవుతోంది. ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ లో ఆయన ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. విలన్ రోల్ కోసం రూ.8 కోట్లు అంటే సాధారణ విషయం కాదు. అయితే బాబీ డియోల్ (Bobby Deol) నటించడం వల్ల ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరిగే ఛాన్స్ ఉంది.

బాలయ్య కొత్త మూవీ డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా బాబీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాలయ్య బాబీ కాంబో మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కావాల్సి ఉంది. బాలయ్య రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకొని డబుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus