నాని సినిమాలో బాలీవుడ్ నటుడు

  • June 28, 2017 / 10:37 AM IST

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. అదే ఉత్సాహంతో నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్నారు. నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో ‘నిన్ను కోరి’ సినిమా చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీని తర్వాత  “ఓ మై ఫ్రెండ్ ఫేమ్” వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించారు.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ ఫిల్మ్ కి  ‘ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ నటిస్తున్నట్లు తెలిసింది. హిందీలో ఇటీవలే విడుదలై విజయం సాధించిన ‘పింక్’ సినిమాలో విజయ్ వర్మ నటించాడు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. టాలీవుడ్ ఎంట్రీ గురించి విజయ్ వర్మ ఓ మీడియాతో మాట్లాడారు. “నా ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వేణు శ్రీరామ్ బొంబాయ్ వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పారు. నచ్చి వేంటనే ఒప్పుకున్నాను. ఈ సినిమాలో చేయడం సంతోషంగా ఉంది”అని అన్నారు. తన క్యారక్టర్ గురించి చెప్పడానికి ఇష్టపడని విజయ్.. ఎంసీఏ షూటింగ్ లో తాను జాయిన్ అయినట్లు తెలిపారు. తెలుగు డైలాగ్స్ తానే స్వయంగా నేర్చుకుని ఎవరి సహాయం లేకుండా చెబుతున్నానని ఆనందంగా చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus