స్పైడర్ మరో సంచలనం – బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్స్!

  • June 3, 2017 / 12:52 PM IST

ప్రిన్స్ మహేష్ బాభ్ ఏం చేసినా మ్యాజిక్ అనే చెప్పాలి. క్లాస్ నుంచి మాస్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రిన్స్ సినిమా అంటే ఆ రేంజ్ వేరు అనే చెప్పాలి. అయితే అసలు విషయం ఏమిటి అంటే ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “స్పైడర్” సినిమా ఫర్స్ట్ లుక్ తో కాస్త డివైడ్ టాక్ రావడంతో అలెర్ట్ అయిన స్పై టీమ్, వెంటనే కాస్త డిఫరెంట్ గా టీజర్ ను లాంచ్ చేసింది. ఇక అక్కడ మొదలయింది అసలు మ్యాటర్. స్పైడర్ టీజర్ యూ ట్యూబ్ లో దుమ్ముదులుపుతుంది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ టీజర్ కు 50 లక్షల వ్యూస్ రావటం చూస్తూ ఉంటే ఈ టీజర్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్న ఆలోచనలో ఉన్నారు మన ట్రేడ్ పండితులు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై అంచనాలు చూస్తే సినిమా టైటిల్, ఫర్స్ట్ లుక్ విడుదల అయిన సమయంలో ఉన్న బజ్ వేరు, టీజర్ విడుదల తరువాత ఉన్న బజ్ వేరు.

ముందు అయితే అందరూ ఈ సినిమాను గూఢాచారి సినిమాగా భావించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ టీజర్ పుణ్యమా అని ఇదో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ అనే ప్రచారానికి ఊతం వచ్చింది. దీనిపై అంచనాలు మరింత ఎక్కువైపోయాయి. జేమ్స్ బాండ్ తరహా మూవీకి అద్భుతమైన గ్రాఫిక్స్ ను జోడించి.. దీన్నో సాంకేతిక అద్భుతంగా మురుగుదాస్ తీర్చిదిద్దుతున్నారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాపైనే ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ వాళ్ళు పూర్తి ఫోకస్ పెట్టారు. టీజర్ మీద వచ్చిన బజ్ తో బాలీవుడ్ ఒక్కసారి అలెర్ట్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది ఈ సినిమా రానున్న రోజుల్లో మరో సంచలనంగా మారుతుందన్న అంచనాను బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాత్రికి రాత్రే మొటట్మ్ తారుమారయ్యి సినిమాపై పూర్తి పాసిటివ్ వేవ్ మొదలవడం విశేషం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus