యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ తర్వాత చేయనున్న చిత్రం పనుల్లో వేగం పుంజుకుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లనున్న ఈ ఫిలిం గురించి ఆసక్తిర విషయం బయటికి వచ్చింది. ఇందులో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నట్లు తెలిసింది. అనేక సూపర్ హిట్ హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన వివేక్ రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమే. ఇప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీకి సైన్ చేసినట్లు సమాచారం.
ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా మధిని తీసుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో మంచి పేరున్న బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు డార్లింగ్ ఫిల్మ్ కి సంగీతాన్ని అందించనున్నారు. ఎక్కువగా దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకోనున్న ప్రభాస్ 19 సినిమాలో ఓ ఫైట్ ని మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో షూట్ చేయనున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన సినిమాపై భారీ అంచాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates