Pushpa 2 Movie: ‘పుష్ప 2’లో ఆ హీరోయిన్‌ను తీసుకున్నారా..!

  • June 21, 2022 / 05:23 PM IST

ఓ సినిమా ఐటెమ్‌ సాంగ్‌కి కోసం నటించాల్సిన హీరోయిన్‌, మరో సినిమాలో కీలక పాత్రలో నటిస్తే.. వినడానికే వైవిధ్యంగానే ఉందట. కానీ ఇప్పుడు ఈ ఫీట్‌ జరగబోతోంది. అది కూడా తెలుగు సినిమాలోనే. అందులోనూ సుకుమార్‌ – బన్నీ సినిమాలో. అవును ‘పుష్ప 2’ గురించి ఇదంతా. ‘పుష్ప 2’ సినిమాను త్వరలో పట్టాలెక్కిస్తారట. ఈ నేపథ్యంలో కాస్టింగ్‌ విషయంలో చర్చలు తుది దశకు వచ్చాయట. అలా సినిమాలోకి కీలకమైన పోలీసు అధికారి పాత్రకు ఈషా గుప్తాను తీసుకున్నారని టాక్‌.

‘పుష్ప’లో ఈషా గుప్తా అంటూ గతంలోనే వార్తలొచ్చాయి. ‘ఉ అంటావా ఊ ఊ అంటావా..’ అంటూ సమంత ఆ మధ్య ఓ ఊపు ఊపేసిన పాట ఉంది కదా. అందులో తొలుత నర్తించాల్సిన నాయిక ఈషా గుప్తానే. ఆమెను ఫైనల్‌ చేశారు అని వార్తలొచ్చినప్పుడే ‘కాదు కాదు సమంత’ అంటూ అసలు విషయం చెప్పేసింది మైత్రీ టీమ్‌. అయితే అప్పటికే ఈషా గుప్తాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ అడ్వాన్స్‌తోనే ‘పుష్ప 2’లో ఈషా గుప్తాను తీసుకున్నారని టాక్‌.

‘పుష్ప 2’ లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రలో ఈషా గుప్తాను తీసుకున్నారని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అలాగే సినిమాలో శ్రీవల్లి పాత్రను చంపేస్తున్నారని టాక్‌ కూడా నడుస్తోంది. సినిమా రొమాన్స్‌ పాళ్లు కలపడానికి శ్రీవల్లి పాత్రను లేపేసి, వేరే హీరోయిన్‌ తీసుకొస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్‌ రూమర్‌ ఏంటంటే… సినిమా సెకండాఫ్‌లో హీరోను విదేశాలకు తీసుకెళ్తారట.

ఈ మొత్తం రూమర్ల విషయంలో క్లారిటీలు అయితే రావాల్సి ఉంది. ‘పుష్ప 1’ విడుదలైనప్పుడు త్వరలోనే సెకండ్‌ పార్ట్‌ స్టార్ట్‌ చేసేస్తాం అని చెప్పారు. మరీ నెలకో, రెండు నెలలకే ఎక్స్‌పెక్ట్‌ చేయలేం కాబట్టి.. కొద్ది రోజుల ఆగారు ఫ్యాన్స్‌. అలా అలా ఇప్పుడు ఆరు నెలలు దాటిపోయింది ఇంకా సినిమా స్టార్ట్‌ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు ఈ రూమర్లకు చెక్‌ పడతాయో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus