సైరా చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్న బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్!

  • July 25, 2018 / 02:14 PM IST

మెగా ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 200 కోట్లను కేటాయించారు. అంతకు మించి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏక కాలంలో మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వయసును పక్కన పెట్టి రాత్రి పగలు కష్టపడుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నగర శివార్లలో షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న టీజర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. టీజర్ కట్ పూర్తి చేయడమే కాదు. అందుకు సంగీతాన్ని అందించడం మొదలు పెట్టారు.

సైరా చిత్రానికి మొదట ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని తీసుకున్నారు. అతను ప్రాజక్ట్ నుంచి తప్పుకోవడంతో జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది ప్రాజెక్ట్ లో కలిశారు. ఈయన గతంలో ‘దేవ్ డి, ఇష్క్ జ్యాదా, క్వీన్, హైవే, లూటేరా’ వంటి సినిమాలకు సంగీతం ఇచ్చారు. అతను సైరా కోసం రంగంలోకి దిగేసారు. టీజర్ కి మ్యూజిక్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే స్వాతంత్ర పోరాటం సమయంలో వచ్చే ఒక మాంటేజ్ సాంగ్ కూడా కంపోజ్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే మిగతా ట్యూన్స్ ఇవ్వనున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, తమన్నా, హ్యూమా ఖురేషి తదితరులు నటిస్తున్న ఈ మూవీ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలని చిత్ర బృందం ఆశిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus