ఒక బాషలో హిట్టయిన చిత్రాల్ని మరో భాషలోకి రీమేక్ చేయడం సర్వసాధారణమైన విషయం. ఇందులో భాగంగా సౌత్ లో హిట్టయిన చిత్రాల్ని బాలీవుడ్లోకి రీమేక్ చేయడం.. అలాగే బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన సినిమాల్ని సౌత్ లోకి రీమేక్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చిత్రాల్ని సౌత్ లో రీమేక్ చేయడం కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫీల్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టున్నారు. ఇప్పటీకే ‘గల్లీ బాయ్’ లాంటి సూపర్ హిట్ చిత్ర రీమేక్ హక్కుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారట.
ప్రస్తుతం బాలీవుడ్ హిట్ చిత్రాలు ‘క్వీన్’ ‘పింక్’ లను సౌత్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ లిస్టు లోకి మరో సినిమా చేరిందట. గతేడాది బాలీవుడ్ సంచలన విజయం నమోదు చేసిన ‘బదాయి హో’ చిత్రాన్ని ఇప్పుడు సౌత్ లో రీమేక్ చేయాలనుకుంటున్నారట. చిన్న సినిమాగా విడుదలై ఈ చిత్రం అఖండవిజయాన్ని నమోదుచేసింది. దాదాపు రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లను నమోదుచేసి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సౌత్ లోని అన్ని భాషల్లో రీమేక్ చేయబోతున్నాడట. అమిత్ షా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇక్కడ ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.