Pooja Hegde: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ హీరోయిన్‌ కోసం డైరక్టర్‌ భాస్కర్‌ మాటల్లో!

పాన్‌ ఇండియా సినిమా, పాన్‌ ఇండియా హీరో లాగా… పాన్‌ ఇండియా హీరోయిన్‌ కూడా ఉంది. ఆమెనే పూజా హెగ్డే. తెలుగు, తమిళం, హిందీల్లో వరుగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఎక్కడికి తగ్గట్టు అక్కడ సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది. కేవలం గ్లామర్‌ డాల్‌గా మిగిలిపోవాలని అనుకోకుండా… ప్రాథాన్యం ఉన్న పాత్రలే చేస్తోంది. ఈ క్రమంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ ప్రాధాన్య పాత్రనే చేస్తోంది. అయితే ఈ పాత్ర ఆమె చేయగలుగుతుందా అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ అనుకున్నారట.

భాస్కర్‌ ఇంటిపేరుగా మారిపోయిన ‘బొమ్మరిల్లు’లో హాసిని పాత్ర ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘ఆరెంజ్‌’లోనూ అంతే. ఇప్పుడు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ పూజ పాత్ర అలానే ఉంటుందట. అయితే ఈ పాత్ర స్టార్‌డమ్‌ ఉన్న హీరోయిన్‌ నప్పదేమో అనుకున్నరాట బొమ్మరిల్లు భాస్కర్‌. అదే మాట నిర్మాత బన్నీ వాసుకు కూడా చెప్పారట. కానీ పూజ యాక్టింగ్‌ చూశాక.. అదిరిపోయింది అనుకున్నారట. సినిమాలో పూజాహెగ్డే స్టాండప్‌ కమెడియన్‌ రోల్‌లో కనిపిస్తుంది.

హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసుకున్నప్పుడు… ఇలాంటి ఎనర్జిటిక్‌ రోల్‌లో పూజ ఎలా చేస్తుందో అనుకున్నారట భాస్కర్‌. ఇదే విషయాన్ని బన్నీ వాసు దగ్గర చెబుతూ… ‘స్టాండప్ కమెడియన్‌ చాలా కష్టమైన పాత్ర. ఒకవేళ పూజ సరిగ్గా చేయకపోతే ఎలా’ అన్నారట భాస్కర్‌. సినిమా షూట్‌ మొదలెట్టాక… పూజ డెడికేషన్‌ చూసి… భాస్కర్‌ ఫిదా అయ్యారట. చూద్దాం ఈ పాత్ర తెరపై ఎలా పండుతుందో?

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus