Devara, Salaar: దేవర్ వర్సెస్ సలార్.. అలా జరిగితే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?

  • September 22, 2023 / 06:56 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి మేకర్స్ నుంచి సరైన క్లారిటీ రావడం లేదు. డిసెంబర్, సంక్రాంతి సీజన్లను మిస్ చేసుకుంటే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంది. పెద్ద సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి నవంబర్ ఏ మాత్రం అనుకూలం కాదు. 2024 సంవత్సరం సమ్మర్ కానుకగా ఇప్పటికే దేవర మూవీ షెడ్యూల్ అయి ఉందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు పోటీగా సలార్ మూవీ విడుదలైతే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవుతుంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లకు సంబంధించి కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కు మంచి అనుబంధం ఉంది. అందువల్ల దేవర వర్సెస్ సలార్ పోటీ నిజం కాదని కొంతమంది చెబుతున్నారు.

మరోవైపు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్లు మారుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. రిలీజ్ డేట్లను ప్రకటించి ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. చెప్పిన డేట్ కు సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Devara, Salaar) దేవర, సలార్ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు పోటీ పడకుండా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus