Boyapati Srinu Weapons: గుర్తిండిపోయే బోయపాటి ఆయుధాలు!

  • May 13, 2022 / 03:10 PM IST

మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ బోయపాటి శ్రీను. భద్ర సినిమా నుంచి అతను యాక్షన్ ని నమ్ముకున్నారు. బోయపాటి ప్రతి సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ తప్పకుండా ఉండాల్సిందే. అంతేకాదు అందులో తనదైన ముద్ర ఉంటుంది. గ్రేట్ వెపన్స్ ని పరిచయం చేయడం బోయపాటి స్పెషల్. ఆ ఆయుధాలపై లుక్ వేద్దాం..

తులసి కత్తి తులసి సినిమాలో విక్టరీ వెంకటేష్ పట్టే కత్తి .. ఇదివరకు వెంకీ మాత్రమే కాదు ఏ హీరో పట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఆ భారీ కత్తి వింటేజ్ లుక్ లో ఆకట్టుకుంది.

సింహ గొడ్డలి బాలకృష్ణకు పూర్వవైభవం తెచ్చిన సినిమా సింహ. ఇందులో నరసింహ పాత్ర దుష్టులను గొడ్డలితో తెగనరుకుతాడు. ఆ గొడ్డలి డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

లెజెండ్ గొడ్డలి బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ లెజెండ్. ఇందులో బాలకృష్ణ నడిపే బుల్లెట్ చాలా ఫేమస్ అయింది. దాంతో పాటు గొడ్డలి కూడా బాగా ఫేమస్ అయింది.

దమ్ము కొడవలిమాస్ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము లో సూపర్ కొడవలిని పట్టారు. ఇంతపెద్ద కొడవలిని యాక్షన్ సీన్స్ కోసమే డిజైన్ చేశారు.

సరైనోడు వ్యాయామశాలలో ఉపయోగించే సాధనాలను ఆయుధాలుగా మలుచుకున్నాడు సరైనోడు. ముఖ్యంగా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ పట్టుకున్న వెయిట్ అందరి మదిలో ముద్రపడిపోయింది.

జయ జానకి నాయక ప్రస్తుతం బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా జయ జానకి నాయక. ఇందులోనూ అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కార్ డోర్ తో బెల్లంకొండ శ్రీనివాస్ పరిగెత్తుతున్న షాట్ చూస్తుంటేదాన్నే ఆయుధంగా మలిచారనిపిస్తోంది.

వినయ విధేయ రామ

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు చరణ్ చేతిలో ఉన్న కత్తి, అలాగే తుపాకీ, అలాగే ముస్లిం లు వాడే కత్తులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

అఖండ

బోయపాటి – బాలయ్య హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీలో త్రిశూలం అందరి దృష్టిని ఆకర్షించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus