టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరూ ఒక్కొరకంగా సినిమాలు చేస్తూ తీస్తూ ఉంటారు…కొందరు కామెడీ పై పట్టుతో ఫుల్ లెంత్ ఎంటర్టేన్మెంట్ సినిమాలు చేస్తే, మరి కొందరు ఆక్షన్ మూవీస్ చేస్తారు…ఇంకా కొందరు సెంటిమెంట్ మూవీస్ తో అభిమానులని ఎమోషన్ కి గురి చేస్తూ ఉంటారు…ఇదిలా ఉంటే వారందరిలో నేను ప్రత్యేకం అంటాడు దర్శకుడు బోయపాటి. తన సినిమాల్లో హీరోలను సూపెర్ యాక్షన్ హీరోలుగా చూపిస్తూ బోయపాటి మాస్ ఫ్యాన్స్ కు పండగ తెస్తాడు.
అయితే అదే క్రమంలో ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరం అనే చెప్పాలి…ఇదిలా ఉంటే ఈ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు అంటూ సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసిన శ్రీను మంచి హిట్ కోసం ఎదురుచూస్తూ ఎలా అయినా హిట్ కొట్టాలి అన్న కసితో బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా మాత్రం రెగ్యులర్ బోయపాటి స్టైల్ లో ఉండదట. వయిలెన్స్ ఏమాత్రం లేకుండా ఫ్యామిలీ సైతం చూసేలా ప్లాన్ చేస్తున్నాడు మన బోయపాటి. మరి అసలే మన దర్శకుడు వయిలెన్స్ కు ఫేమస్ అలాంటిది అది పెద్దగా లేకపోవడం అంటే ప్రయోగమే అని చెప్పాలి..చూద్దాం మరి ఏం జరుగుతుందో.