బాలయ్య కాదనడంతో ఆ యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న బోయపాటి
- April 27, 2019 / 06:53 PM ISTByFilmy Focus
నిన్నమొన్నటివరకూ తన తదుపరి చిత్రం బాలకృష్ణతో అని చెప్పుకుంటూ వచ్చిన బోయపాటికి సైలెంట్ గా గాలి తీసేశాడు బాలయ్య. తన తదుపరి చిత్రం బోయపాటితో కాదని.. తనకు “జైసింహా” లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ తోనని నిన్న అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో బోయపాటి సినిమా మరి కొన్నాళ్లు వెనక్కి వెల్లిందని తేలిపోయింది. దాంతో బోయపాటి నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది.
- అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం బోయపాటి-బాలయ్య సినిమా క్యాన్సిల్ అవ్వలేదని, కాకపోతే అనుకున్న సమయానికంటే కాస్త లేట్ అవుతుందని.. ఈ గ్యాప్ లో బోయపాటి ఒక యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని, గత ఏడాది సూపర్ హిట్ కొట్టిన ఈ హీరోతో బోయపాటి ప్రొజెక్ట్ వచ్చే నెల నుంచి సెట్స్ కు వెళ్లనుందని సమాచారం. సో, బోయపాటి ఈ షార్ట్ గ్యాప్ లో ఒక సినిమా కంప్లీట్ చేసి.. ఏడాది చివర్లో బాలయ్య సినిమా మొదలెడతాడన్నమాట.













