‘బిబి 3’ టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారయ్యింది!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమాకి టైటిల్ ఖరారు చెయ్యలేదు. ప్రస్తుతానికి ‘బిబి 3’ అని వ్యవహరిస్తున్నారు. బిబి అంటే బాలకృష్ణ & బోయపాటి అని మీనింగ్. ఇక, 3 అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా అని మీనింగ్. ఈ సినిమాకి ‘మోనార్క్’, ‘డేంజర్’ టైటిళ్లు ఖరారు చేసినట్టు ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే, అవేవీ టైటిల్ పరిశీలనలో కూడా లేవని టాక్. విజయ దశమికి సినిమా టైటిల్ అనౌన్స్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట. బాలయ్య అభిమానులు బోయపాటి ఇచ్చే దసరా గిఫ్ట్ అదే.

‘బిబి 3’లో బాలకృష్ణకి జంటగా యాక్ట్ చెయ్యబోయే హీరోయిన్ ఎవరనేది కూడా విజయ దశమికి అనౌన్స్ చెయ్యవచ్చని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంజలి, శ్రియ శరణ్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బోయపాటి మాత్రం పేరున్న హీరోయిన్‌ని కాకుండా కొత్త హీరోయిన్‌ని సెలెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ముంబై నుండి సూపర్ మోడల్‌ని తీసుకొస్తున్నార్ట. ఆల్రెడీ హీరోయిన్‌ని ఫైనలైజ్ చేశార్ట. టైమ్ చూసి అనౌన్స్ చెయ్యాలని అనుకుంటున్నార్ట.

త్వరలో బోయపాటి షూట్ స్టార్ట్ చెయ్యాలనుకున్నారు. కరోనా కారణంగా షూట్ చెయ్యడానికి అంతరాయం ఏర్పడింది. కొవిడ్19 వైరస్‌కి ఏమాత్రం భయపడకుండా షూట్ చెయ్యడానికి బాలకృష్ణ రెడీ అన్నారు. బోయపాటి రిస్క్ ఎందుకని ఆలోచించారు. ఇప్పుడు అందరూ షూటింగ్స్ చేస్తున్నారు. బోయపాటి కూడా దాంతో రెడీ అవుతున్నారు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus