సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?

‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తూ చిత్ర యూనిట్ సభ్యులు ఓ ప్రోమోని విడుదల చేశారు. అందులో ‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావ్?’ అని మురళీ శర్మ అడిగితే.. ‘ఇవ్వలేదు వచ్చింది’ అంటూ మన బన్నీ అంటాడు. ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అయితే కొంతమంది టాలీవుడ్ హీరోలు ఊహించని విధంగా సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు? వాళ్ళకి ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది అనే చెప్పొచ్చు. వాళ్ళు కావాలనే గ్యాప్ ఇచ్చారా లేక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చెయ్యడం వల్ల గ్యాప్ వచ్చిందా? అంటే కచ్చితంగా వాళ్లకు నచ్చిన స్క్రిప్ట్ దొరికే వరకూ వెయిట్ చెయ్యడం వల్లే గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు.

అయితే స్క్రిప్ట్ దొరికాక అది పట్టాలెక్కించి విడుదల చెయ్యడానికి కూడా మరింత టైం పడుతుంది కాబట్టి.. గ్యాప్ మరింతగా పెరుగుతుందనే చెప్పాలి. మరి ఇప్పటి టాలీవుడ్ జనరేషన్లో ఎక్కువ గ్యాప్ తీసుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) మహేష్ బాబు : ‘అతిథి’ (2007) – ‘ఖలేజా'(2010) : 1085 రోజుల గ్యాప్

2) రవితేజ : ‘బెంగాల్ టైగర్'(2015) – ‘రాజా ది గ్రేట్'(2017) : 678 రోజుల గ్యాప్

3) రామ్ పోతినేని : ‘మసాలా'(2013) – ‘పండగ చేస్కో'(2015) : 561 రోజుల గ్యాప్

4) రాంచరణ్ : ‘చిరుత'(2007) – ‘మగథీర'(2009) : 672 రోజుల గ్యాప్

5) ప్రభాస్ : ‘బాహుబలి2′(2017) -‘సాహో’ (2019) : 855 రోజుల గ్యాప్

6) పవన్ కళ్యాణ్ : ‘జల్సా'(2008) – ‘కొమరం పులి'(2010) : 891 రోజుల గ్యాప్

7) కళ్యాణ్ రామ్ : ‘కత్తి’ (2010) – ‘ఓం’ 3D (2013) : 980 రోజుల గ్యాప్

8) ఎన్టీఆర్ : ‘కంత్రి’ (2008) – ‘అదుర్స్'(2010) : 614 రోజుల గ్యాప్

9) అల్లు అర్జున్ : ‘నా పేరు సూర్య'(2018) – ‘అల వైకుంఠపురములో'(2020) : 618 రోజుల గ్యాప్

10) గోపీచంద్ : ‘సౌఖ్యం'(2015) – ‘గౌతమ్ నంద’ (2017) : 582 రోజుల గ్యాప్

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus