బాలీవుడ్ లో ‘సీత’ అనే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దర్శకుడు అలౌకిక్ దేశాయ్ ఈ సినిమాను రూపొందించనున్నారు. రామాయణంలో సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది. అయితే ‘సీత’ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని సంప్రదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సినిమా కోసం ఆమె రూ.12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు. అయితే ‘సీత’ పాత్రలో కరీనా కపూర్ ని తీసుకునే ఆలోచనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ భార్య, తైమూర్ తల్లి అయిన కరీనాను సీత పాత్ర కోసం ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లాడిన నటిని సీత పాత్ర కోసం తీసుకోవడం తప్పంటూ వాదిస్తున్నారు. ఇది హిందువుల సెంటిమెంట్స్ పై దెబ్బ కొట్టే చర్య అంటూ ఫైర్ అవుతున్నారు. #BoycottKareenaKhan అనే హ్యాష్ ట్యాగ్ ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కరీనాకు బదులుగా కంగనాను తీసుకోమంటూ సలహాలు ఇస్తున్నారు.
ఈ విషయంలో దర్శకనిర్మాతలు తమ నిర్ణయం మార్చుకోకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందని దర్శకనిర్మాతలు కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు కరీనాను తీసుకునే ఉన్నా దాన్ని డ్రాప్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు!