Allu Arjun: అల్లు అర్జున్ పై బ్రహ్మాజీ కొడుకు సంజయ్ కామెంట్స్ వైరల్!

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా ‘ఓ పిట్ట కథ’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఓటీటీలో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఓ ఓటీటీ ప్రాజెక్టు చేశాడు. అది పెద్దగా ఆకట్టుకుంది లేదు. అయితే ఇప్పుడు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్’ ‘మైక్ మూవీస్’ బ్యానర్ల పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జూలై 29న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా సంజయ్ రావు పాల్గొని అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంజయ్ మాట్లాడుతూ.. ” నాన్న ‘పుష్ప 2 ‘ షూటింగ్లో ఉన్నప్పుడు .. అల్లు అర్జున్ గారు వచ్చి ‘మీ అబ్బాయి ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా ట్రైలర్ చూశాను.

సినిమా ఎలా ఉంటుందో తెలీదు కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది’ అని అన్నారట. ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ కి కూడా చూడమని చెప్పారట. అల్లు అర్జున్ గారు కష్టం తెలిసిన మనిషి. పెద్ద నిర్మాత కొడుకు అయితే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం తప్ప. అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఎంత హార్డ్ వర్క్ చేశారో.. నాన్న గారు వచ్చి మాకు చెబుతుండేవారు. నాకు ఇన్స్పిరేషన్ (Allu Arjun) అల్లు అర్జునే ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus