సర్దార్ రికార్డు బద్దలుకొట్టిన నమ్రతా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తున్న ‘బ్రమ్మోత్సవం’ చిత్రంపై విడుదలకి ముందే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఓవర్సీస్ లో మహేష్ బాబుకి మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ఓవర్సీస్ లో రికార్డు కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ సంపాదించింది. ఇక తాజాగా మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోతున్న ‘బ్రమ్మోత్సవం’ చిత్రం యూఎస్ రైట్స్ కోసం మహేష్ భార్య నమ్రత 13 కోట్లు డిమాండ్ చేస్తుందని బయ్యర్లందరూ వాపోతున్నారు.
ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి కూడా అంత చెల్లించి రైట్స్ తీసుకోలేదని పలువురు డిస్ట్రిబ్యూటర్లు నమ్రతని కన్విన్స్ చేయాలనీ ప్రయత్నించిన ఆమె మాత్రం రేటు దిగిరాలేదు. ఇటీవల 10.5 కోట్లకు ‘సర్దార్’ చిత్ర రైట్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది అనుకుంటే ఆ చిత్రం కంటే ఎక్కువగా చెప్పి నమ్రత బయ్యర్లను భయపెడుతుంది. తాజాగా పీవిపీ అధినేతకి కూడా నమ్రత అదే రేటు చెప్పడంతో ఇక 13 కోట్లకు పీవిపీ సంస్థ డీల్ కుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు  తను అనుకున్న మొత్తానికి ‘బ్రమ్మోత్సవం’ చిత్ర రైట్స్ ని అమ్మి నమ్రత యూఎస్ మార్కెట్ లో మహేష్ బాబు స్థాయిని  నిరూపించింది. ఈ చిత్రానికి ఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus