ఇప్పుడేకంగా 18 నిమిషాలు కత్తిరించేసారు!

  • May 24, 2016 / 01:59 PM IST

ప్రదర్శితమైన మొదటి ఆట నుంచే విపరీతమైన నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో.. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన “బ్రహ్మోత్సవం” సినిమాను ఓ వారం ఆడించడం కూడా కష్టమైపోతోంది. థియేటర్లు కనీసం 30% శాతం కూడా నిండటం లేదు.

రెండో రోజుకే 12 నిమిషాలు పాటు కత్తిరించి.. “పుట్ యువర్ హ్యాండ్స్ అప్” అనే పాటను పూర్తిగా కత్తిరించేసిన “బ్రహ్మోత్సవం” బృందం.. ఇప్పుడు మరో 6 నిమిషాలు ట్రిమ్ చేశారట. దాంతో.. సినిమాలో మొత్తం 18 నిమిషాల నిడివి గల సన్నివేశాలకు కత్తెర పడిందని తెలుస్తోంది.

156 నిమిషాల నిడివిగల సినిమా విడుదల చేస్తే.. 18 నిమిషాలు పోగా ఇప్పుడు 138 నిమిషాలు మిగిలింది. కనీసం ఇప్పుడైనా “బ్రహ్మోత్సవం”నెట్టుకొస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు కూడా ఆడకపోతే.. ఇక సినిమాను థియేటర్ నుంచి తీసేయడమే తరువాయి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus