సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘బబుల్ గమ్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థతో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి బాగానే అనిపించాయి.
దీంతో డిసెంబర్ 29 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయినప్పటికీ బిజినెస్ ఓ మోస్తరుగా జరిగింది. చాలా చోట్ల నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఒకసారి బ్రేక్ ఈవెన్ వివరాలు వంటివి ఏంటో తెలుసుకుందాం రండి :
నైజాం
1.80 cr
సీడెడ్
0.40 cr
ఆంధ్ర(టోటల్)
1.50 cr
ఏపీ + తెలంగాణ
3.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్
0.80 cr
వరల్డ్ వైడ్ టోటల్
4.50 cr
‘బబుల్ గమ్’ (Bubblegum) చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.75 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఒకపక్క పోటీగా ‘డెవిల్’ సినిమా ఉంది. మరోపక్క ‘సలార్’ రెండో వీకెండ్లో కూడా స్ట్రాంగ్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయి. సో ‘బబుల్ గమ్’ పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే న్యూ ఇయర్ హాలిడే సాయంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.