Ram Charan: అక్టోబరులో సినిమా స్టార్ట్‌ అన్నారు.. ఇప్పుడు రీషూట్ అంటున్నారు!

  • September 2, 2024 / 06:25 PM IST

ఆ దర్శకుడి తొలి సినిమా 2021లో వచ్చింది.. ఇంకా రెండో సినిమా మొదలవ్వలేదు. ఈ రెండు ముక్కలు చాలు ఆ దర్శకుడు ఎవరో చెప్పడానికి. మూడేళ్లుగా కొత్త సినిమాకు మెగాఫోన్‌ పట్టుకుని యాక్షన్‌ చెప్పడానికి వెయిట్‌ చేస్తున్న ఆ దర్శకుడు బుచ్చిబాబు  (Buchi Babu)   సానా. ‘ఉప్పెన’ (Uppena)  సినిమా వచ్చి మూడున్నరేళ్లు దాటిపోయింది. వచ్చే నెలలో కొత్త సినిమా స్టార్ట్‌ అని వార్తలొస్తున్నా.. వేరే సినిమా అప్‌డేట్‌ చూస్తుంటే కష్టమే అనిపిస్తోంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌ పనులు అయిపోయాయి, ఇక పోస్ట్‌ ప్రొడక్షనే అని ఇటీవల ‘భారతీయుడు 2’ (Indian 2) సినిమా ప్రచారంలో చెప్పారు దర్శకుడు శంకర్‌ (Shankar)  .

Ram Charan

అయితే తాజా సమాచారం ప్రకారం ‘గేమ్‌ ఛేంజర్‌’ కోసం కాస్త ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది అంటున్నారు. అయితే కొంతమంది రీషూట్‌ అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఆ సినిమా మళ్లీ రామ్‌చరణ్‌ (Ram Charan)  మేకప్‌ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో బుచ్చిబాబు సానా సినిమా ఇంకొన్ని రోజులు పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ‘గేమ్‌ ఛేంజర్‌’లో గెటప్‌కి.. ‘పెద్ది’ (రూమర్డ్‌ టైటిల్‌) (RC16/Peddi)  సినిమాలోని గెటప్‌కి చాలా డిఫరెన్స్‌ ఉంది అని ఇప్పటికే వార్తలొచ్చాయి.

దీని కోసం రామ్‌చరణ్‌ మేకోవర్‌ అవ్వాల్సి ఉంది అని కూడా చెప్పారు. శంకర్‌ సినిమాకు, బుచ్చిబాబు సినిమాకు మధ్య గ్యాప్‌ అడిగింది కూడా దాని కోసమే అని అన్నారు. అయితే, ఇప్పుడు చూస్తుంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ అవుతోంది. ఈ లెక్కన బుచ్చిబాబు సినిమా కోసం చరణ్‌ రెడీ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే నవంబరులో సినిమా ప్రారంభమవ్వొచ్చు అని చెబుతున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవల లాంఛనంగా మొదలైంది. ఇక ఈ సినిమాలో వినోదం ఫుల్‌ లెవల్‌లో ఉంటుంది అని ఇప్పటికే చరణ్‌ చెప్పేశారు.

ఎన్టీఆర్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ పై మైత్రీ నిర్మాతల ట్వీట్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus