గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కాలేజ్ ఘటన విషయంలో భిన్న వాదనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాలేజ్ విద్యార్థుల వాదన, పోలీస్ అధికారుల వాదన భిన్నంగా ఉండటంతో ఈ ఘటనకు సంబంధించి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Pooam Kaur) కాలేజ్ ఘటన గురించి స్పందిస్తూ అమ్మాయిలను ఎన్నో ఆశలతో, నమ్మకంతో తల్లీదండ్రులు బయటకు పంపుతున్నారని కానీ బయట జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయని ఆమె తెలిపారు.
అమ్మాయిలకు ఈ మధ్య కాలంలో దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయని విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పూనమ్ అన్నారు. నేను ఒక కూతురుగా ఈ లేఖ రాస్తున్నానని ఆమె వెల్లడించారు. ఒక అమ్మాయి చాలామంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టేయడం నాకు అసహ్యం కలిగిస్తోందని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.
నేరస్తులకు గుణపాఠం చెప్పాలని నిందితులు ఎంత శక్తిమంతులైనా లెక్క చేయొద్దని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. “కూతురిగా, చెల్లిగా మీరు చూడాలనుకుంటున్న మార్పు కోసం పోరాడండి” అంటూ గాంధీజీ కోట్ ను పూనమ్ జత చేశారు. పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మరి కొందరు సెలబ్రిటీలు సైతం ఈ ఘటన గురించి స్పందిస్తూ విద్యార్థులకు అండగా నిలవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన దృష్టికి వచ్చిన ప్రతి ఘటన గురించి అభిప్రాయాన్ని పంచుకున్నారు. పూనమ్ కౌర్ ను అభిమానించి సపోర్ట్ చేసేవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. గుడ్లవల్లేరు కాలేజ్ కు సెలవులను ప్రకటించగా రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
#AndhraPradesh pic.twitter.com/DgpWBaw1dO
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 31, 2024