Samantha: హేమ కమిటీని స్వాగతిస్తున్న సమంత.. మిగతా హీరోయిన్ల సంగతేంటి?

  • September 1, 2024 / 12:09 PM IST

మలయాళ సినీ పరిశ్రమ గురించి ఈ మధ్య అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ పరంగా వాళ్ళ సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. తక్కువ బడ్జెట్లో అంత క్వాలిటీతో సినిమాలు ఎలా చేస్తున్నారు? అని మిగతా భాషల్లోని ఫిలిం మేకర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి టైంలో జ‌స్టిస్ హేమా క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ అందరినీ షాక్ కి గురిచేసింది. మలయాళం ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఆర్టిస్ట్..లకి ముఖ్యంగా మహిళలకి చాలా సమస్యలు ఉన్నట్టు ఆ నివేదిక తెలుపడం జరిగింది. సెట్స్ లో ఉండే అమ్మాయిలకి క్యాస్టింగ్ కౌచ్, Laiగిక వేధింపులు వంటివి ఎలాగూ తప్పడం లేదు.

Samantha

‘కనీసం వారికి షాట్ గ్యాప్ లో మంచి నీళ్లు ఇచ్చే వాళ్ళు, గాయపడితే అత్యవసర చికిత్స అందించే సదుపాయాలు కూడా లేవు’ అని హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. దీనికి పరిష్కారాలు, సూచనలు వంటివి కూడా ఆ నివేదికలో జోడించడం ద్వారా ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. హేమ కమిటీని స్వాగతిస్తూ సమంత (Samantha) కూడా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి కమిటీ ఒకటి టాలీవుడ్లో కూడా వేయాలని ఆమె డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని.. అదే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది.

దాని ద్వారా సమంత స్పందిస్తూ.. “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూ సీసీ) చేస్తున్న కృషి అభినందించదగినది. డబ్ల్యూ సీసీ నుండి స్ఫూర్తినొంది.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ‘గ్రూపు ది వాయిస్ ఆఫ్ వుమెన్’ ని 2019లోనే ఏర్పాటు చేయడం జరిగింది. Laiగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నాం. ఇది తెలుగు సినీ పరిశ్రమ కోసం పని చేసే మహిళల రక్షణ చర్యల కోసం,

ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది” అంటూ ప్రభుత్వాన్ని అర్థిస్తూ సమంత (Samantha) పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది గట్టిగా ఉంది అనేది చాలా మంది చెబుతున్న మాట. కానీ దాని గురించి ఓపెన్ గా చెబుతున్న వాళ్ళు తక్కువ. సమంత వంటి స్టార్ హీరోయిన్లు ఇంకొంతమంది ముందుకు వచ్చి మిగతా నటీమణులకు, జూనియర్ ఆర్టిస్ట్..లకి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘ఓజీ’ ట్రీట్ కోసం ఇంకా ఎన్నాళ్ళు ఆగాలంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus