NTR: ఎన్టీఆర్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ పై మైత్రీ నిర్మాతల ట్వీట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో మైత్రీ బ్యానర్ ఒకటి కాగా ఈ బ్యానర్ సక్సెస్ రేట్ కూడా ఇతర బ్యానర్లతో పోల్చి చూస్తే ఎక్కువనే సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఎన్టీఆర్  (Jr NTR)  ప్రశాంత్ నీల్ కాంబో మూవీని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కాల్సి ఉన్నా వార్2 ఈ సినిమా కంటే ముందుగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ఎన్టీఆర్ 32వ సినిమా కానుంది.

NTR

తారక్ (NTR) ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకకు వెళ్లారనే సంగతి తెలిసిందే. అక్కడ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , రిషబ్ శెట్టిలతో  (Rishab Shetty)  కలిసి తారక్ పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి దిగిన ఫోటోను ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో పాటు “కామ్ బిఫోర్ సునామీ” అని పేర్కొన్నారు. అయితే ఆ ఫోటో గురించి మైత్రీ నిర్మాతలు స్పందించారు.

లిఖితారెడ్డి షేర్ చేసిన ఫోటోను షేర్ చేస్తూనే జనతా గ్యారేజ్ మూవీ విడుదలై ఎనిమిదేళ్లు అయిందని మరో నెల రోజుల్లోపే తారక్ కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara)  బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుందని పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్టీఆర్ నీల్ కాంబో మూవీ షూట్ మొదలుకానుందని ఈ సినిమాతో సునామీని సృష్టించబోతున్నామని మైత్రీ నిర్మాతలు చెప్పుకొచ్చారు. సాధారణంగా స్క్రిప్ట్ పై ఎంతో నమ్మకం ఉంటే తప్ప నిర్మాతలు ఇలాంటి కామెంట్లు చేయరు.

మైత్రీ నిర్మాతల కాన్ఫిడెన్స్ చూసి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాతే ప్రశాంత్ నీల్ సలార్ (Salaar) సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ (NTR) ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

 2024 ఆగస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్.. అంత ఉరిమి.. ఇంతేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus