‘కొట్టేదేదో గట్టిగానే కొట్టాలేహే..’ అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు రిపీటెడ్ గా పలుకుతుంటాడు. ఆ ఫార్ములాని సుకుమార్ శిష్యులు పక్కగా ఫాలో అవుతున్నారు అని చెప్పొచ్చు.
లేట్ అయినా పర్వాలేదు.. పెద్ద ప్రాజెక్టులే సెట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా బుచ్చిబాబు సానా.. ఈ విషయంలో ముందున్నాడు అని చెప్పాలి.
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న బుచ్చిబాబు.. ఆ వెంటనే రామ్ చరణ్ తో ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమా చేసే ఛాన్స్ ధక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం శ్రీదేవి కూతుర్ని, ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్..ని రంగంలోకి దింపాడు.
త్వరలోనే అంటే ఏప్రిల్ 30నే ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషనల్ కంటెంట్ అన్నిటికీ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది.ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా.. ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఇండస్ట్రీ రికార్డులు కొట్టడం పక్కాగా కనిపిస్తుంది. సరిగ్గా అలాగే జరిగితే.. దర్శకుడు బుచ్చిబాబు సానా రేంజ్ పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ కాన్ఫిడెన్స్ అయితే బుచ్చిలో కనిపిస్తుంది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్టుని కూడా పెద్దగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.అందుతున్న సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్టుని ప్రభాస్..తో(Prabhas) చేయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘పెద్ది’ రిలీజ్ తర్వాత ప్రభాస్ ని కలిసి కథ వినిపించే దిశగా.. బుచ్చి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడట.
కాకపోతే ప్రభాస్ ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ‘ఫౌజీ’ ‘కల్కి 2898 AD (సీక్వెల్) ‘ ‘స్పిరిట్’ వంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ‘సలార్ 2’ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది.బుచ్చిబాబు కథకి ప్రభాస్ ఓకే చెప్పినా.. దానికి ఇంకో 2 ఏళ్ళు టైమ్ పట్టొచ్చు. దానికి బుచ్చి కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నట్టు తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ ప్రాజెక్టుని సెట్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా మరో టాక్ వినిపిస్తోంది.