మాస్ రాజా రవితేజ గతేడాది నటించిన 3 చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. వీటిలో ‘నేల టికెట్’ కూడా ఒకటి. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతయిన రామ్ తుళ్ళూరి తోనే తన తరువాతి చిత్రం ‘డిస్కో రాజా’ చేస్తున్నాడు. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈమద్యే ఈ చిత్రం ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆపేశారని.. దీనికి ముఖ్య కారణం రవితేజ తన ఫ్యామిలీని తీసుకుని విదేశాలకి టూర్ కి వెళ్ళడమే అని అందరూ అనుకున్నారు. కానీ దీనికి అసలు కారణం అది కాదని సమాచారం.
అసలు విషయం ఏమిటంటే… ఈ చిత్రం బడ్జెట్ చాలా ఎక్కువయ్యిపోతుందని తెలుస్తుంది. అది రవితేజ మార్కెట్ ను కూడా మించి ఉంటుందని తెలుస్తుంది. అసలే రవితేజ నటించిన గత 3 చిత్రాలు 10 షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. దీంతో బడ్జెట్ ను కంట్రోల్లో ఉండేలా చూడమని నిర్మాత రామ్, దర్శకుడు ఆనంద్ కు చెప్పాడట. దీంతో పాటల సెట్లు వేయాల్సి ఉన్నా, యాక్షన్ సీన్లకి సెట్లు వేయాల్సి ఉన్నా.. లైట్ తీసుకుని ఔట్ డోర్ వెళ్ళి షూటింగ్ చేయడానికి రెడీ అయ్యిపోయాడట. అంతేకాదు హీరోయిన్లతో అనవసరమైన సన్నివేశాలతో వారి డేట్లు ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా వారికీ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని.. వారి కోసం షెడ్యూల్ ను మారుస్తున్నారని తెలుస్తుంది. అట్లాగే కాస్టింగ్, టెక్నీషియన్ల విషయంలో పెట్టే బడ్జెట్ ను కూడా దగ్గరుండి ప్లాన్ చేస్తున్నాడట ఆనంద్. దీనికోసమే ప్లాన్ మొత్తం మారుస్తున్నారని.. అందుకే షూటింగ్ కు బ్రేక్ పడిందని సమాచారం. మరి తిరిగి షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకూ కూడా ఈ చిత్రం డౌటే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.