నాని పై ట్రోల్స్ వెనుక అల్లు అర్జున్ హస్తం..?
- March 4, 2019 / 12:41 PM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి `గ్యాంగ్‌లీడర్` చిత్రం అప్పట్లో ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కుటుంబాన్ని ఆదుకునే యువకుడి పాత్రలో చిరంజీవి నటనకి ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ థియేటర్లు దద్దరిల్లేలా చేసి నిజంగానే బాక్సాఫీస్ ను రఫ్ఫాడించారు. ఇక చిరంజీవి మాస్ ఇమేజ్‌ను కూడా అమాంతం పెంచేసింది ఈ చిత్రం. అలాంటి ఈ చిత్ర టైటిల్ ను తన 24వ చిత్రానికి పెట్టుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అయితే ‘నాని.. గ్యాంగ్ లీడర్’ ఏంటి.. ఆస్థాయి నీకు ఉందా’ అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ నాని పై మండిపడుతున్నారు.
- 118 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- విశ్వాసం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- “అంజలి సిబిఐ” రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అయితే ఈ టైటిల్ మొదట అల్లు అర్జున్ కోసం అనుకున్నారట. దర్శకుడు విక్రమ్.కే.కుమార్ ఈ కథను ముందు బన్నీకే వినిపించాడు. ఈ కథకు `గ్యాంగ్‌లీడర్` టైటిలే కరెక్ట్‌గా సరిపోతుందని స్వయంగా అల్లు అర్జునే సూచించాడట. ఇక బన్నీ కోసం చాలా నెలల గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే ఉండిపోయాడు విక్రమ్. అయితే బన్నీ… త్రివిక్రమ్ చిత్రాన్ని లైన్లో పెట్టడంతో… నాని తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు విక్రమ్. ఇలా కథ డిమాండ్ చేయడంతో ఈ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ నే ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్. ‘పాపం… బన్నీ కి పడాల్సిన ట్రోల్ల్స్ ఇప్పుడు నాని పై పడుతున్నాయి’ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.














