చిన్న సినిమాలు క్యాష్ చేసుకోగలవా..?

  • November 4, 2022 / 03:39 PM IST

ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన సినిమాలు హిట్టు మీద హిట్టు కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఆ తరువాత పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమాలు రాలేదనే చెప్పాలి. దసరాకు విడుదలైన సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’కి హిట్ టాక్ వచ్చినప్పటికీ.. సరైన కలెక్షన్స్ రాలేదు. దసరా సీజన్ తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త డల్ అయింది. డబ్బింగ్ సినిమాలు ‘కాంతారా’, ‘సర్ధార్’ మాత్రం సత్తా చాటాయి. తెలుగు సినిమాలేవీ కూడా వర్కవుట్ కావడం లేదు.

థియేటర్లనీ అందుబాటులో ఉన్నా.. పోటీ పెద్దగా లేకపోయినా.. ఆ అడ్వాంటేజీను వాడుకునే సినిమాలు రావడం లేదు. గత వారం ఒక్క సరైన సినిమా కూడా రాలేదు. ఈ వారమైనా పరిస్థితి మారుతుందని ట్రేడ్ ఎదురుచూస్తుంది. ఈ వారం ఏకంగా పది సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని సినిమాల గురించి అసలు ప్రేక్షకులకు ఐడియా కూడా లేదు. ఇవన్నీ నామమాత్రపు రిలీజ్ లనే చెప్పాలి. ఉన్నంతలో బజ్ క్రియేట్ చేసిన సినిమాలంటే ‘ఊర్వశివో రాక్షసివో’, ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’.

ఇందులో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా యూత్ లో ఆసక్తి క్రియేట్ చేయగలిగింది. ఇప్పుడు సినిమాకి కూడా హిట్ టాక్ వస్తుంది. ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మంచి కామెడీ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’పై కూడా కొంత బజ్ తెచ్చుకోగలిగింది. అయితే ఈ మూడు సినిమాలకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. మౌత్ టాక్ గనుక బాగుంటే ఈ సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

నిజానికి ఇలాంటి చిన్న సినిమాలకు జనాలు థియేటర్లకు వెళ్లడం లేదు. ఓటీటీలో చూసుకుందామని లైట్ తీసుకుంటున్నారు. మంచి టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లేలాలేరు. మరి ఈ సినిమాలు ఆడియన్స్ ను ఎంతవరకు కదిలిస్తాయో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus