2019 లో ‘యాత్ర’ సినిమా వచ్చింది.మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఈ మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా అద్భుతాలు చేయకపోయినా .. ఏపీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి మంచి మైలేజీ ఇచ్చినట్టు అయ్యింది. ఇప్పుడు అంటే 2024 లో కూడా ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లోకి రాకపోయినా.. ఆ హడావిడి అయితే మొదలైపోయింది. ఇదే రైట్ టైం అని భావించి రాజకీయ నేపథ్యంలో రూపొందిన కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.
అందులో ‘యాత్ర 2’ కూడా ఒకటి. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. వైసీపీ పార్టీ నేతలకి, అభిమానులకి బూస్టప్ ఇచ్చేలా ఈ మూవీ ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 8 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ హడావిడి అయితే ఇంకా మొదలుకాలేదు. ఈ సినిమా కూడా వైసీపీకి మైలేజ్ అందిస్తుంది అని అంతా భావిస్తున్నారు.
ఇది పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ కి పాజిటివ్ గా ఉండే సినిమా కావడమే దానికి కారణం అని చెప్పాలి. అయితే అదే డేట్ కి పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది అని సమాచారం. అది పూర్తిగా వైసీపీ అభిమానుల ఆనందానికి బ్రేకులు వేసే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే అందులో ‘పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయి.
ముఖ్యంగా అలాంటి వాడికి ఓటేస్తే నీ కరెంటు బిల్లు పెరిగిపోద్ది, నీకు దూల తీరిపోద్ది’ వంటి జనాలని ప్రభావితం చేసే డైలాగులు ఉంటాయి. రీ రిలీజ్ సినిమాలకి సోషల్ మీడియాలో ఉండే హడావుడి అందరికీ తెలుసు కాబట్టి.. వాట్సాప్ స్టేటస్ ..లు వంటి వాటితో ఆ సినిమా మార్మోగడం ఖాయం. ఆ రకంగా (Yatra2) ‘యాత్ర 2 ‘ దెబ్బ పడే అవకాశాలు కూడా లేకపోలేదు