‘డియర్ కామ్రేడ్’ పరిస్థితి మరీ ఘోరం

  • July 31, 2019 / 04:29 PM IST

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మొదటి షో నుండే ప్లాప్ టాక్ ను మూట కట్టుకుంది. మొదటి మూడు రోజులు తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కలెక్షన్లు ఏమాత్రం రావడం లేదు. యూ.ఎస్ లో ప్రీమియర్స్ ఓ రేంజ్లో వచ్చినప్పటికీ.. వీకెండ్ పూర్తయ్యేసరికి కేవలం $700 K డాలర్ల దగ్గర ఆగిపోయింది. మిగిలిన $300 K డాలర్లను రప్పించడానికి చిత్ర యూనిట్ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. జూలై 26 న విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండ, రష్మిక పెర్ఫార్మన్స్ లు బాగున్నప్పటికీ దర్శకుడు భరత్ కమ్మ టేకింగ్ మరీ స్లో గా.. ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా ఉండడమే కారణమని తెలుస్తుంది. అలా అని సినిమాలో మ్యాటర్ లేదా అంటే… చాలా మంచి కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడు దర్శకుడు భరత్. కానీ దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్పాలి.

డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యే పరిస్థితి ఎలాగూ లేదు… కనీసం నష్టాలైనా తగ్గించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 15 నిమిషాలు ట్రిమ్ చేసి కొత్త వెర్షన్ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. అయినప్పటికీ టికెట్లు తెగడం లేదు. ఇక ఓవర్సీస్ లో ‘వన్ ప్లస్ వన్’ ఆఫర్ పెట్టినా జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పోటీ ఏమాత్రం లేని ఈ టైములో కామ్రేడ్ ఉపయోగించుకోలేకపోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ పేర్లు చెప్పుకుని ఈ చిత్రాన్ని భారీ రేట్లు పెట్టి కొనేశారు నిర్మాతలు. ఇపుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వారున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus