Allu Arjun: ఆ యాడ్ లో నటించి బన్నీ తప్పు చేశారా?

  • June 10, 2022 / 11:16 AM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ ను పెంచుకున్నారు. పుష్ప ది రైజ్ విజయంతో పుష్ప ది రూల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ బన్నీ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా బన్నీ ఒక వివాదంలో చిక్కుకున్నారు.

శ్రీచైతన్య విద్యాసంస్థల కొరకు బన్నీ ఒక యాడ్ లో నటించగా ఈ యాడ్ వల్ల బన్నీపై కేసు నమోదైంది. ప్రముఖ సామాజిక కార్యకర్తలలో ఒకరైన కొత్త ఉపేందర్ రెడ్డి యాడ్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో శ్రీ చైతన్య విద్యా సంస్థలపై, బన్నీపై ఫిర్యాదు చేయడం గమనార్హం. అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు నమోదైంది. శ్రీచైతన్య ఐఐటీ, ఎన్‌ఐటీ ర్యాంకులకు సంబంధించి ఈ నెల 6వ తేదీన ప్రముఖ వార్తాపత్రికలలో ఒక యాడ్ వచ్చింది.

బన్నీ ఈ యాడ్ ను ప్రమోట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. తప్పుడు ప్రకటనలో నటించిన బన్నీపై తగిన చర్యలు తీసుకోవాలని కొత్త ఉపేందర్ రెడ్డి కోరడం గమనార్హం. పుష్ప సినిమా సక్సెస్ తో బన్నీకి ఊహించని స్థాయిలో బ్రాండ్ వాల్యూ పెరిగింది. అయితే బన్నీ నటిస్తున్న యాడ్స్ వరుసగా వివాదాలలో చిక్కుకుంటూ ఉండటం గమనార్హం. బన్నీ తప్పేం లేకపోయినా యాడ్స్ విషయంలో బన్నీ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జొమాటో, ర్యాపిడో యాడ్స్ వల్ల బన్నీపై గతంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే యాడ్స్ ద్వారా బన్నీ ఆదాయం మాత్రం భారీగా పెరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఫిర్యాదు గురించి బన్నీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus