అవ్వడానికి బాలీవుడ్ హీరోయినే అయినప్పటికీ పూనమ్ పాండే అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిత్యం కొత్త కొత్త హాట్ ఫొటోలతో కుర్ర కారుకి చమటలు పట్టించడంతో పాటు… ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది ఈ బ్యూటీ. గ్లామర్ షో చెయ్యడానికి ఈమె ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. ఇప్పటికే ఎన్నో బోల్డ్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేసి ఎన్నో వివాదాలకు తెరలేపింది.
ఎంత మంది ఈమెను విమర్శించినా అస్సలు తగ్గదు. సరే అసలు విషయం ఏమిటంటే .. తాజాగా ఈమె పై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే…. గోవాలో ఈ బ్యూటీ అసభ్యకరమైన వీడియోలో పాల్గొనడం వలన ఈమె పై కేసు నమోదయ్యిందట.అక్కడి ప్రభుత్వ ఎంతో పవిత్రంగా భావించే చపోలీ డ్యామ్ వద్ద పూనం అసభ్యంగా ఓ వీడియోలో పాల్గొంటుందట. ఈమె వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించి.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు అతని పై ఎఫ్.ఐ.ఆర్ కూడా ఫైల్ చేశారట.మరోపక్క పూనమ్ పై కూడా గోవా ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం కేసు పెట్టినట్టు తెలుస్తుంది. వారు ఎంతో పవిత్రంగా భావించే చపోలీ డ్యామ్ వద్ద అలాంటి నీచపు పనులు చెయ్యడం .. వారి సంస్కృతిని అవమానించినట్టే అని వారు కంప్లైంట్లో పేర్కొన్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.