యాక్టింగ్ స్కూల్లోనూ తప్పని లైంగిక వేధింపులు

నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాల్సిందేనట. బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ యువతుల్ని వేధిస్తున్న ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అచింత కౌర్ చద్దా అనే యువతి ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. “హిమాయత్ నగర్‌లో ఉన్న ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’కు వినయ్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్‌గా ఉన్నారు. ఏప్రిల్ 16న వినయ్ వర్మ ఆధ్వర్యంలో యాక్టింగ్ తరగతులు నడుస్తున్నాయి. ఇంతలో తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పి అనంతరం ఒక్కొక్కరిగా అందరినీ బట్టలు విప్పమని చెప్పారు.

ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను బట్టలు తీయనని మా సర్‌కు చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ ఒక యువతి ఆయన చెప్పినట్టుగానే బట్టు విప్పింది. మిగతా యువతులు కూడా అలాగే చేశారు” అని చెప్పుకొచ్చింది. ఇనిస్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన యువతి “షీ టీమ్”కు ఫిర్యాదు చేసింది. ఏసీపీ నర్మద, రామ్ లాల్ నుంచి మంచి వెంటనే స్పందన వచ్చిందని యువతి చెప్పింది. అయితే ఏసీపీ సూచన మేరకు నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదని వాపోయింది.నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాల్సిందేనట. బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ యువతుల్ని వేధిస్తున్న ఓ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus