వినయ విధేయ రామలో స్పెషల్ సాంగ్ సై అన్న డస్కీ బ్యూటీ

  • December 2, 2018 / 03:47 AM IST

అమ్మాయిలు అవునంటే కాదని, కాదంటే అవుననీ అర్థం చేసుకోవాలంటారు. తారల మాటలకూ ఇలాగే వ్యతిరేక అర్థాలు తీసుకోవాలేమో. అందాల నాయిక క్యాథరీన్‌ ట్రెసా వ్యవహారం దీనికేం తీసిపోలేదు. ప్రత్యేక గీతాలకు దూరం దూరమంటూనే మరో పాటకు తయారవుతోంది. ఏమంటే ఆ దర్శకుడు అప్పట్లో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారని సమాధానమిస్తోంది. అలాగని క్యాథరీన్‌ ఖాళీగా ఏం లేదు. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో తీరిక లేకుండానే ఉంది. వాటిలో తమిళ, మలయాళ చిత్రాలున్నాయి…కాగా త్వరలో రవితేజ సరసన క్యాథరీన్‌ ఆడిపాడబోతోంది.

దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ రవితేజ హీరోగా రూపొందించబోతున్న చిత్రంలో ఈ సుందరే నాయికగా ఎంపికైందట. ఈలోగా రామ్‌ చరణ్‌ బోయపాటి వినయ విధేయ రామ సినిమా ప్రత్యేక గీతానికి సిద్ధమవుతోంది. గతంలో జయ జానకీ నాయకా చిత్రంలో ఏ ఫర్‌ యాపిలూ అనే పాటలో అందాలను ఆరేసింది. సినిమాల్లో నాయికలను తక్కువ చేసి చూపిస్తున్నారని పలుమార్లు చెప్పిన క్యాథరీన్‌ తనే ప్రత్యేక గీతాలకు ముందుకు రావడం విశేషమే మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus