అవును అల్లు అర్జున్ హీరోయిన్ ఓ వింత జబ్బుతో బాద పడుతుందట. అయితే ప్రాణానికి ప్రమాదకరమైన జబ్బు అయితే కాదు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ ‘సరైనోడు’ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన కేథరీన్ కు అనోస్మియ అనే వ్యాధి ఉందట.
ఈ జబ్బు ఉన్న వారు ఎటువంటి వాసన చూడలేరట. అది సువాసన అయినా.., దుర్వాసన అయినా…, వారికి తెలియదన్న మాట. వాసన చూసే శక్తి కూడా వారికి అస్సలు ఉండదట. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే ఈ జబ్బు ఉంటుంది. చాలా రేర్ అన్నమాట..! ఈ జబ్బు కారణంగానే ఈ అమ్మడు పెళ్ళి చేసుకోదట. అసలు ఓ హీరోయిన్ ఇలా ఎందుకు చెబుతుంది అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కంగారు పడకండి.. ఆమె ఇలా చెప్పడానికి కారణం. ‘వదలడు’ సినిమా ..! సిద్దార్థ్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రంలో కేథరీన్ వ్యాది తో బాధపడే అమ్మాయి పాత్రలో కేథరీన్ కనిపిస్తుందట అంతే…!