మెగా హీరో సరసన ఎమ్మెల్యే!

“అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అనే సామెత ప్రస్తుతం కేతరీన్ కెరీర్ గ్రాఫ్ కు సరిగా సూట్ అవుతుందేమో. అందం, అభినయ సామర్ధ్యంతోపాటు.. అందాన్ని ఆరబోసేందుకు కూడా ఏమాత్రం మొహమాట పడకపోవడం వంటి ప్లస్ పాయింట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. అమ్మడికి సరైన ఆఫర్లు రావట్లేదు. ఇటీవల విడుదలైన “నేనే రాజు నేనే మంత్రి” సినిమా సక్సెస్ అయినప్పటికీ.. సినిమాలో జోగేంద్ర గెలవడానికి క్రెడిట్ కొట్టేసిన రాధలా.. సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని రాణా, తేజ, కాజల్ సమానంగా షేర్ చేసుకోవడంతో.. కేతరీన్ ఎకౌంట్ ఖాళీ అయిపోయింది. అప్పట్నుంచి తెలుగు-తమిళ భాషల్లో కొన్ని ప్రొజెక్ట్స్ ట్రై చేస్తున్నప్పటికీ సరైన సినిమాలు రాకపోవడం.. వచ్చేవి కొత్త హీరోలతో కావడంతో ఇక చేసేది లేక కెరీర్ నెట్టుకురావడం కోసం వచ్చిన ఆఫర్లలో కాస్త బెటర్ ఆప్షన్స్ సెలక్ట్ చేసుకుంటూ ముందుకెళుతోంది.

అయితే.. అమ్మడు ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు సూపర్ ఆఫర్ దొరికిందని టాక్. త్వరలో దిల్ రాజు బ్యానర్ లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కథానాయికగా కేతరీన్ ను ఎంపిక చేసుకొనే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. పెర్ఫ్మార్మెన్స్ తోపాటు గ్లామర్ కూడా సమపాళ్లలో ఉన్న కథానాయకి అవసరం ఉండడంతో వారికి వెంటనే కేతరీనే గుర్తుకొచ్చిందట. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కానీ.. ప్రియారిటీ లిస్ట్ లో మాత్రం కేతరీన్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ప్రొజెక్ట్ గనుక ఫైనల్ అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ సరసన మూడు సినిమాలు చేసిన కేతరీన్ హ్యాపీగా మెగా ఫ్యామిలీ హీరోయిన్ అయిపోతుంది. అప్పుడు మెగా హీరోలందరితోనూ వరుసబెట్టి సినిమాలు చేసేయొచ్చు కదా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus