‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలయ్యింది.’జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మొదటి షోతోనే ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా సాధించలేకపోయింది.
ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
1.19 cr
సీడెడ్
0.55 cr
ఉత్తరాంధ్ర
0.36 cr
ఈస్ట్
0.23 cr
వెస్ట్
0.14 cr
గుంటూరు
0.23 cr
కృష్ణా
0.25 cr
నెల్లూరు
0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.09 cr
ఓవర్సీస్
0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.32 cr
‘చావు కబురు చల్లగా’ చిత్రానికి 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 13.7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 3.32 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఈ చిత్రం కొన్న బయ్యర్స్ కు ఏకంగా 10.38 కోట్ల భారీ నష్టాలు వాటిల్లయన్న మాట.