‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలయ్యింది. ‘జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించాడు. కొత్తగా విడుదలైన 3 చిత్రాల్లో దీనికే కాస్త డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ మొదటి రోజే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించడంతో ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది.
ఇక ఈ చిత్రం 3 డేస్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.07 cr
సీడెడ్
0.49 cr
ఉత్తరాంధ్ర
0.31 cr
ఈస్ట్
0.20 cr
వెస్ట్
0.12 cr
గుంటూరు
0.20 cr
కృష్ణా
0.22 cr
నెల్లూరు
0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.08 cr
ఓవర్సీస్
0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.93 cr
‘చావు కబురు చల్లగా’ చిత్రానికి 13.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 13.7కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 2.93 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 10.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం బాగా రాణిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.