చమ్మక్ చంద్ర టీంలో అమ్మాయిని తీసుకోడానికి కారణం?

చమ్మక్ చంద్ర.. ‘జబర్దస్త్’ దాదాపు అందరూ చూస్తారు కాబట్టి.. ఈయన గురించి ఎక్కువ పరిచయం అవసరం లేదు. ఈయన స్కిట్స్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఎక్కువగా అసభ్యకరమైన మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా శృతిమించకుండా చూసుకుంటూ ఉంటాడు చంద్ర. ఇదిలా ఉంటే.. ‘జబర్దస్త్’ ప్రారంభించిన కొత్తలో అమ్మాయిలు అస్సలు ఉండేవారు కాదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎక్కువగా కొడుతున్నట్టు, తన్నుతున్నట్టు కూడా సీన్లు ఉంటాయి.

అయితే అమ్మాయిలను తీసుకుంటే.. మేల్ ఆర్టిస్ట్ లు కూడా అంత ఫ్రీగా చెయ్యలేరు అనేది మరో రీజన్. అందుకే డైరెక్టర్స్ కూడా అందుకు ఒప్పుకునే వారు కాదు. అయితే అటు తరువాత చంద్ర టీం లో ఒక అమ్మాయిని తీసుకున్నాడు. అది ఎలా సాధ్యమయ్యింది.. అనేది చాలా మంది డౌట్. చంద్ర చేసేవి చాలా వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే రాసుకుంటాడు. కాబట్టి డైరెక్టర్స్ ను ఒప్పించి ఓ అమ్మాయిని తీసుకున్నాడట.

ఈమె పేరు సత్య. ‘రాజా ది గ్రేట్’ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అయినా ఈమెకు అంత గుర్తింపు రాలేదు. కానీ ‘జబర్దస్త్’ షోతో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. ఈమె చంద్ర టీంలో ఎంట్రీ ఇచ్చాక.. ఆ టీంకి ఉన్న క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు చంద్ర, సత్య ఇద్దరూ ‘అదిరింది’ షోకి జంప్ అయిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus