రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు… ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి!

  • May 13, 2020 / 10:21 AM IST

రానా దగ్గుబాటికి పెళ్లీడు వచ్చి చాలా కాలమే.. అవుతుంది. ఒక విధంగా ఆయన కొంచెం లేట్ చెప్పొచ్చు. ఆయన వయసు 35సంవత్సరాలు…చాలా కాలంగా రానా పెళ్లిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఎప్పుడు, ఏ సందర్భంలో.. ఎవరు అడిగినా తెలివిగా దాటేసి తప్పించుకున్న రానా ఎవరు అడగకుండానే తన బెటర్ హాఫ్ ని పరిచయం చేశారు. తనకి ప్రపోజ్ చేశాను.. ఆమె ఎస్ అంది అని రొమాంటిక్ గా తెలియజేశాడు.

అలాగే తన మనసు దోచిన ఆ ప్రేయసి ఫోటోని కూడా పంచుకున్నాడు. మరి ఈ టాలీవుడ్ హల్క్.. బల్లాల దేవుడుని తన ప్రేమతో బంధీ చేసిన ఆ చిన్నది ఎవరు అనే ఉత్సుకత అందరిలో ఉంటుంది. మీ కోసం ఆ అమ్మాయి ఎవరో..? ఆమె నేపథ్యం. ఏమిటో తెలుసుకుందాం…

యంగ్ ఇంటర్ప్రెన్యూర్

రానా మనసు పడిన ఆ ముద్దుగుమ్మ పేరు మిహీక బజాజ్. హైదరాబాద్ మూలాలు కలిగిన ఈ అమ్మడు ఒక యంగ్ బిజినెస్ లేడీ. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు డెకరేషన్ సంస్థలను నడుపుతుంది. హైదరాబాద్ అమ్మాయి అయిన ఈ అమ్మడుకి ఇండియన్ ఆర్కిటెక్చర్ పై ఉన్న మక్కువతో అటు వైపు అడుగులు వేసింది.

చదువు…

ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ పై ఆకర్షణతో ముంబైలోని రచన సన్సాద్ అనే విద్యా సంస్థ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా చేసింది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీ నుండి ఎమ్ ఏ డిగ్రీ ఆర్ట్ మరియు డిజైన్ విభాగంలో డిగ్రీ పొందింది మిహీక బజాజ్. పిక్సీ డస్ట్ పేరుతో ఓ బ్లాగ్ ఆమెకు ఉండగా, అందులో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు.

అమ్మానాన్నలది జ్యువలరీ బిసినెస్

మిహీక బజాజ్ తల్లిదండ్రులు హైదరాబాద్ లోనే నివాసం ఉంటారు. తల్లి బంటీ బజాజ్ కాగా తండ్రి సురేష్ బజాజ్. వీరికి హైదరాబాద్ లో క్రాసల అనే ఓ జ్యువలరీ బ్రాండ్ ఉంది. తల్లి బంటీ బజాజ్ జే ఎన్ టి యూ యూనివర్సిటీ హైదరాబాద్ లో చదువుకున్నారు. ఆమె వృత్తి రీత్యా జ్యువలరీ డిజైనర్. ఇక ఈమెకు సామ్రాట్ అనే బ్రదర్ ఉన్నారు. ఆయన క్రాసల జ్యువలరీ బ్రాండ్ మానేజ్మెంట్ చూసుకుంటున్నారు.

ఇక అత్యంత ఇష్టమైనది

డెకార్ వర్క్ అంటే మిహీక బజాజ్ కు ప్రాణం. చిన్నప్పటి నుండి డెకార్ వర్క్ చూస్తే పెరిగిన ఆమెకు క్రియేటివ్ పర్సన్స్ కి అద్భుతమైన రంగం అంటారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus