“చందమామ రావే” ఫస్ట్ కాపీ రెడీ

  • September 1, 2016 / 10:30 AM IST

యువ హీరో నవీన్ చంద్ర “అందాల రాక్షసి” తర్వాత మరో ప్రేమకథతో ముందుకు వస్తున్నాడు. ధర్మ, రక్ష దర్శకత్వంలో తెరకెక్కిన “చందమామ రావే” లో నవీన్ విభిన్న ప్రేమికుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ ద్వారా మలయాళం నటి ప్రియాల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్లో కిరణ్, శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ గత నెల విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో నవీన్ చంద్ర డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. “అది రాదు.. వీడు మారడు” ట్యాగ్ లైన్ తో యువతను ఆకర్షిస్తోన్న “చందమామ రావే” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.

ప్రసాద్ ల్యాబ్ లో గురువారం డీటీఎస్ మిక్సింగ్ కంప్లీట్ అయినట్లు హీరో నవీన్ చంద్ర ట్విట్టర్లో వెల్లడించారు. సంగీత దర్శకుడు శ్రావణ్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారనీ తెలిపారు. తన టెక్నీకల్ టీమ్ తో కలిసి తీయించుకున్న సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నేటి యువతరానికి మెచ్చే కథతో రూపొందిన ఈ సినిమా రిలీజ్ తేదీని నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus