Balakrishna,Chandrababu: బాలయ్య షోకు చంద్రబాబు.. దబిడి దిబిడే?

  • September 29, 2022 / 06:55 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారనే సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీకి అన్ స్టాపబుల్ షో ద్వారా ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. అతి త్వరలో అన్ స్టాపబుల్ సీజన్2 మొదలుకానుందనే సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చిరంజీవి హాజరు కానున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా పవన్, త్రివిక్రమ్ కలిసి ఈ షోకు హాజరు కానున్నారని తెలుస్తోంది.

అనుష్క, సమంత కూడా ఈ షోకు హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితాలో ఇప్పటివరకు సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల పేర్లు వినిపించగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. బాలయ్య అడిగితే ఈ షోకు హాజరు కావడానికి చంద్రబాబు నో చెప్పే అవకాశం అయితే దాదాపుగా ఉండదు.

అన్ స్టాపబుల్ షోలో బాలయ్య హోస్ట్ గా చంద్రబాబు బాలయ్య అడిగే ప్రశ్నలకు జవాబులు చెబితే దబిడి దిబిడే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పొలిటికల్ సెలబ్రిటీలు ఈ షోకు హాజరైతే ఈ షో క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు వినిపించిన సెలబ్రిటీలతో పాటు ఈ జాబితాలో విజయశాంతి పేరు కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం.

రెండో సీజన్ ను కూడా కచ్చితంగా సక్సెస్ చేయడానికి అన్ స్టాపబుల్ నిర్వాహకులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సీజన్ కూడా సక్సెస్ సాధిస్తే మూడో సీజన్ దిశగా అడుగులు పడనున్నాయి. బాలయ్య ఈ షో కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. బాలయ్య షోకు తారక్, ప్రభాస్ హాజరైతే ఈ షో రేంజ్ మారిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus