Inaya Sultana: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై వారం రోజులు దాటింది. ఈ సీజన్ కు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ సీజన్ లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొదటి వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. కాబట్టి రెండో వారం కూడా హౌస్ లో 21 మంది కంటెస్టెంట్స్ అలాగే ఉన్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఈ సీజన్ కు 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇనయ సుల్తానా. ఈమె హౌస్ లో సైలెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది కానీ తర్వాత చిన్న చిన్న గొడవల్లో ఇరుక్కుంటుంది. ఈమె గురించి నామినేషన్స్ లో హౌస్మేట్స్ ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారో చూసాము. ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఇనయ సుల్తానా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1)ఇనయ సుల్తానా 1995 వ సంవత్సరం ఆగస్టు 21న హైదరాబాద్లో జన్మించింది. ఈమె పక్కా తెలంగాణ అమ్మాయి.

2) ఈమె ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి అని అంతా అంటుంటారు. కానీ ఈమె హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తేనట.

3)ఈమె మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టింది. తక్కువ టైంలోనే నటిగా మారే అవకాశాలు దక్కించుకుంది.

4)ఇనయ సుల్తానా నటించిన మొదటి చిత్రం ‘ఏవమ్ జగత్’.మంచి కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ.. బాక్సాఫీస్ డల్ గా ఉన్న టైంలో రిలీజ్ అయ్యింది. కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సరైన విధంగా ఈ మూవీని ప్రమోషన్ కూడా చేయలేదు.

5) ఇక ‘ఏవమ్ జగత్’ తర్వాత ‘బుజ్జి ఇలా రా’ ‘నట రత్నాలు’ ‘యద్భావం తద్భవతి’ వంటి చిత్రాల్లో నటించింది.

6) ఇన్ని సినిమాల్లో నటించినా ఇనయ సుల్తానా కి పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ రాంగోపాల్ వర్మ పాల్గొన్న ఓ ప్రైవేట్ పార్టీకి ఈమె వెళ్ళింది. అక్కడ అతనితో కలిసి చేసిన డాన్స్ వల్ల ఈమె బాగా పాపులర్ అయ్యింది.

7) ఆ వీడియో వల్ల తన కుటుంబానికి కూడా ఈమె దూరమైనట్టు తెలిపింది. ప్రస్తుతానికి ఈమె తన కుటుంబంతో దూరంగానే ఉంటూ వస్తోందని ఓ సందర్భంలో తెలియజేసింది.

8) ఎన్ని వివాదాలు తలెత్తినా దర్శకుడు రాంగోపాల్ వర్మ తన శ్రేయోభిలాషి అని పైకి కనిపించేలా అతను కఠినమైన వ్యక్తి కాదని చెబుతుంటుంది ఈ అమ్మడు.

9)ఇనయ సుల్తానా కి డాన్స్ అలాగే షాపింగ్ చేయడం ఎక్కువగా ఇష్టం. ఛాన్స్ దొరికితే ట్రెండ్ కు తగ్గట్టు కొత్త దుస్తులు కొనుగోలు చేయాలని ఈమె భావిస్తుంది.

10) ఇక ఇనయ సుల్తానా ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 59 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న ఇనయ సుల్తానాకి బిగ్ బాస్ ప్రయాణం ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus