Abhinayashree: ‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమయ్యి 2 వారాలు దాటింది. ఎన్నడూ లేని విధంగా మొదటి వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే రెండో వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ క్రమంలో ‘బిగ్ బాస్ 6′ లోకి 9వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అభినయ శ్రీ హౌస్ నుండి బయటకు వచ్చేయడం కూడా జరిగింది.’ఆర్య’ సినిమాలో అ- అంటే అమలాపురం, ఆ – అంటే ఆహా పురం అంటూ అప్పట్లో తెలుగు రాష్ట్రాలను తన డాన్స్ తో గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన అభినయశ్రీ ‘బిగ్ బాస్’ లో కూడా అదే జోష్ తో ఎంట్రీ ఇచ్చింది.హౌస్ లో ఈమె ఎక్కువగా కనెక్ట్ అయినట్టు కనిపించలేదు. హౌస్ మేట్స్ కూడా అదే భావించి ఈమెను నామినేట్ చేసినట్లు ఉన్నారు. తక్కువ ఓట్లు పడడంతో ఈమె హౌస్ నుండి బయటకు రాక తప్పలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి అభినయ శ్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) 1984 జూలై 16న అభినయ శ్రీ చెన్నై లో జన్మించింది. తమిళ్ అమ్మాయే అయినప్పటికీ తెలుగులో బాగానే పాపులర్ అయ్యింది.

2) అభినయ శ్రీ ఒకప్పటి నటి అనురాధ కూతురు అన్న సంగతి ఎక్కువమందికి తెలిసుండదు. ఆమె కూడా మంచి డాన్సర్. కాబట్టి అభినయ శ్రీ కి కూడా చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం.

3) తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్య లు కలిసి నటించిన ‘ఫ్రెండ్స్'(2001) మూవీ ద్వారా ఈమె నటిగా మారింది. అంతకు ముందు ఈమె కొన్నాళ్ల పాటు కొరియోగ్రాఫర్ గా పనిచేసింది.

4) 2001 లోనే నాగార్జున- సుమంత్ లు హీరోలుగా రూపొందిన ‘స్నేహమంటే ఇదేరా’ చిత్రం ద్వారా ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు.

5) ‘స్నేహమంటే ఇదేరా’ ప్లాప్ కావడంతో అభినయ శ్రీ మళ్ళీ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోని సినిమాల్లో నటించింది.

6) 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అభినయశ్రీ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ‘అ అంటే అమలాపురం’ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. అటు తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.

7) ‘ఆర్య’ తర్వాత ‘ఎవడి గోల వాడిదే’ ‘ఆట’ ‘జై’ ‘అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి’ వంటి చిత్రాల్లో నటించింది. 2014 లో వచ్చిన ‘పాండవులు’ చిత్రం తర్వాత ఈమె టాలీవుడ్ కు దూరమైంది.

8) అభినయ శ్రీ తండ్రి పేరు సతీష్ కుమార్, తల్లి పేరు అనురాధ. ఇక సోదరుడి పేరు కెవిన్.

9) 38 ఏళ్ళ వయసొచ్చినప్పటికీ అభినయ శ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణాలు మాత్రం ఈమె బయట పెట్టలేదు. గతంలో ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఆ విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు.

10) అభినయ శ్రీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 లక్ష పైనే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus