Alluri Review: అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ వంటి చిత్రాలతో నిరాశపరిచిన శ్రీవిష్ణు ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో ‘అల్లూరి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మినిమం గ్యారెంటీ సినిమాలు అందిస్తారు అనే పేరున్న బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాత కావడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.అలాగే ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : పోలీస్ కథలు చాలా ఒకే విధంగా ఉంటాయి అనే ముద్ర ఉంది. ‘అల్లూరి’ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. కథ పరంగా చెప్పుకోవడానికి అంతగా ఏమీ ఉండదు. అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ణు) ఓ పోలీస్ ఆఫీసర్… అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలే ఈ సినిమా కథ. తన సర్వీస్ లో చాలా పోలీస్ స్టేషన్లు మారతాడు..

మారిన ప్రతీచోట సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. వాటి కోసం అతను చేసిన పోరాటం ఏంటి.. కొంచెం ఎలాబరేట్ చేస్తే ఇలా ఉంటుంది.

నటీనటుల పనితీరు : శ్రీవిష్ణు ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ‘అల్లూరి’ చాలా ప్రత్యేకమైనది. నిజానికి అతను సాఫ్ట్ గా కనిపిస్తాడు. ఇతను పోలీస్ అనగానే జీర్ణించుకోవడానికి మొదట టైం పడుతుంది. అందులోనూ మనం అల్లూరి గా ఈ మధ్యనే రాంచరణ్ ను కూడా పోలీస్ గా చూసాం. కానీ శ్రీవిష్ణు మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు. ఈ పాత్ర కోసం అతను చాలా కష్టపడ్డాడు. అది తెరపై కనిపిస్తుంది.

అయితే మాస్ హీరో ఇమేజ్ దక్కుతుందా అంటే… అందుకు ఇలాంటి క్యారెక్టర్లు ఇంకో రెండు పడాలి. హీరోయిన్‌గా కాయదు లోహర్ రెగ్యులర్ గా గ్లామర్ కు పరిమితమైంది. అయితే ఈమె పాత్ర సెకండాఫ్‌లో ఆకట్టుకుంటుంది. తనకు మంచి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ లభించింది.సుమన్, మధుసూదనరావు, రిషి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తనికెళ్ళ భరణి తన మార్కు డైలాగులతో కాసేపు అలరిస్తాడు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ప్రదీప్ వర్మకి ఇది మొదటి చిత్రం.అయినప్పటికీ ఇది కొత్త డైరెక్టర్ తీసాడు అని అస్సలు అనిపించదు.ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చాలా చోట్ల గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ సూపర్ అనిపిస్తుంది.అయితే సెకండ్ హాఫ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టుండాల్సింది అనిపిస్తుంది.

అలాగే ఈ సినిమాలో కామెడీ ఉండదు.. దానికి స్కోప్ కూడా లేదు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఈ విషయంలో కొంచెం డిజప్పాయింట్ అవ్వొచ్చు. కానీ దర్శకుడిలో మంచి పొటెన్షియల్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు మెప్పించవు. నేపధ్య సంగీతం పర్వాలేదు. రన్ టైం 2 గంటల 49 నిమిషాలు ఉంది. ఎడిటర్ కు కొంచెం పని పడుతుంది కానీ.. మరీ అంత మైనస్ అని చెప్పలేం.

విశ్లేషణ : సెకండ్ హాఫ్ కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ, కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ.. సగటు మాస్ ఆడియన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ‘అల్లూరి’ లో ఉన్నాయి. పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఇష్టపడే వారు హ్యాపీగా ఈ వీకెండ్ కు ‘అల్లూరి’ ని ట్రై చేయొచ్చు. శ్రీవిష్ణు కెరీర్లో ఇదొక మంచి సినిమాగా నిలుస్తుంది.

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus