ఏ ఇండస్ట్రీలైనా లవ్ ఎఫైర్స్ అనేవి చాలా కామన్. నచ్చినన్ని రోజులు కలిసి ఉండి ఆ తరువాత విడిపోవడం చూస్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఎఫైర్లు కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంతమంది ఈ ఎఫైర్లను పెళ్లి వరకు తీసుకెళ్తుంటే.. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు. యంగేజ్ వాళ్లలో ఇలాంటివి చాలా చూస్తుంటాం కానీ ఇప్పుడొక మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన ఈ నటుడు ఒకప్పుడు హీరోగా సినిమాలు చేశారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 50కి పైగా ఉంటాయి. తన లైఫ్ లో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఈ నటుడు. ఈ పెళ్లిళ్ల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం అతను ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని సమాచారం. ఇండస్ట్రీలో అమ్మ పాత్రల్లో నటిస్తూ ఆమె కూడా కొంత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వీరిద్దరి లవ్ ఎఫైర్ పై ఇండస్ట్రీలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.
చాలా ఏళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇటీవల సినిమా షూటింగ్ కోసం ఈ సీనియర్ నటుడు తిరుపతి వెళ్లాల్సి వస్తే.. యూనిట్ మొత్తం ఫ్లైట్ లో వెళ్తే.. ఈయన మాత్రం తన ప్రేయసిని తీసుకొని కారులో తిరుపతికి వెళ్లారట. ఇక షూటింగ్ లో ఆమె ప్రత్యేకంగా వంట చేసుకొని తీసుకొచ్చి అతడికి పెడుతుండడంతో అక్కడున్న వారంతా వీరి మధ్య ఏదో ఉందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. మరి వీరిద్దరి ప్రేమ కథ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి!