రాజమౌళి డైరెక్షన్లో చరణ్,ఎన్టీఆర్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. అలియా భట్, డైసీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీ.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర ప్రాంతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా… మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు గాయాలవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందట. ఈ విషయాన్నీ స్వయంగా చిత్ర యూనిట్ వెల్లడించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.
విషయంలోకి వెళితే.. నిరంతలు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని చెబుతూ” రాంచరణ్ గాయాలు పాలవ్వడం.. మేము చాలా చింతిస్తున్నాం. నిన్న జిమ్ చేస్తుండగా చరణ్ కు కొద్దిపాటి గాయాలయ్యాయి. దీంతో పూణే షెడ్యూల్ ను క్యాన్సిల్ చేస్తున్నాం. మరో మూడు వరాల తర్వాత.. తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాం” అంటూ నిర్మాతలు పేర్కొన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం… చరణ్ చీలిమండలం దగ్గర గాయమవ్వడంతో వైద్యులు 2 వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారట. ఇందువలెనే 3 వారలు షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు ఆందోళన చెందుతూ.. చరణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.